Bride Suicide: నవ వధువు ఆత్మహత్య…అప్పగింతలకు ముందు విషం తాగి సుసైడ్..!!
ఇష్టం లేని పెళ్లిని అంగీకరించలేని ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది.
- Author : Hashtag U
Date : 14-05-2022 - 9:01 IST
Published By : Hashtagu Telugu Desk
ఇష్టం లేని పెళ్లిని అంగీకరించలేని ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. అప్పగింతలకు మందు విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. మహబూబ్ నగర్ జిల్లా పట్టణానికి చెందిన గుజ్జల పద్మకు నలుగురు కుమార్తులు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మీ పదోతరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ…తల్లి ఆసరగా నిలుస్తోంది. ఈమధ్యే ఆమెకు అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్ తో పెళ్లి కుదిరింది.
దూరపు సంబంధం తనకు ఇష్టం లేదని లక్ష్మీ తన తల్లి పద్మకు చెప్పింది. అయినప్పటికీ లక్ష్మీ మాటలను పెద్దలు పట్టించుకోకుండా శుక్రవారం ఉదయం 9గంటలకు వివాహం జరిపించారు. అయితే పెళ్లి ఇష్టం లేని లక్ష్మీ సాయంత్రం అప్పగింతల సమాయానికి ముందు విషయం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. అప్పటితో పెళ్లితో సంతోషంగా ఉన్న ఇంట్లో విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.