Munugode MLA: సీఎం కెసిఆర్ ను కలిసిన ప్రభాకర్‌రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులు...
- Author : Hashtag U
Date : 07-11-2022 - 8:23 IST
Published By : Hashtagu Telugu Desk
మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులు, ఎన్నికల్లో పనిచేసిన నేతలతో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చిన ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన నేతలను కేసీఆర్ అభినందించారు.
మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. pic.twitter.com/tnHcTvimsw
— Telangana CMO (@TelanganaCMO) November 7, 2022