నేడు జాతీయ వృద్ధుల దినోత్సవం (National Senior Citizens Day 2023)
వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు
- By Sudheer Published Date - 10:41 AM, Mon - 21 August 23

ప్రతిరోజుకు ఏదో ఒక ప్రత్యేకం ఉంటుంది. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు..ఇలా ఏదో ఒకటి జరుపుకుంటూ వాటి తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ..పదిమందికి తెలియజేస్తుంటాం. అలాగే సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు జరుపుకుంటాం. ఇలా ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే చేస్తుంటాం. ఆలా ఈరోజు (ఆగస్ట్ 21) -Indian National Senior Citizens Day , భారత్ జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
వృద్ధులను ప్రభావితం చేసే సమస్యల గురించి అవగాహన పెంచడానికి మరియు సీనియర్‌లకు మద్దతు, గౌరవం, ప్రశంసలు మరియు వారి విజయాలను గుర్తించడం వంటి వాటి గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు. డిసెంబర్ 14, 1990 న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఈ దినోత్సవం ప్రకటించబడింది. ఈ రోజును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1988 లో వృద్ధులకు మరియు వారి సమస్యలకు ఒక రోజు అంకితం చేయడానికి అధికారికంగా స్థాపించారు.
కొమ్మకు పూసిన పూలు వాడక మానవు, చెట్టు కాసినకాయలు పళ్లయిఫలక మానవు. అలాగే పుట్టిన మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సృష్టి ధర్మం. పుట్టుక, పసితనం, యవ్వనం, పెళ్లి, పిల్లలు, వృద్ధాప్యం, మరణం ఇదే జీవిత చక్రం. పిల్లల్నికని, కంటికి రెప్పలా వారిని కాపాడి, ఊపిరిలో ఊపిరిగా చూసుకుంటూ పెంచి పెద్ద చేసి, వారిని ప్రయోజకులవ్వాలని రక్తమాంసాలు, ఆస్తిపాస్తులు కర్పూరంలా కరిగించి, బిడ్డల కోసమే మా జీవితాలు అని తల్లిదండ్రులు భావించి, వృద్యాప్యంలోకి వెళ్తారు.
1950లో మనిషి సగటు ఆయుర్దాయం 46 సంవత్సరాలు, అది- 2010లో 68 ఏళ్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో 2019లో 65 ఏళ్లు దాటినవారి సంఖ్య 70.3 కోట్లు. అది 2050 నాటికి 150కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతికత అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో పెరిగిన అవగాహన మనుషుల ఆయుర్దాయాన్ని పెంచింది.
వృద్ధాప్యాన్ని చాలా మంది శాపంగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. తల్లితండ్రులు వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్లు తమను కళ్లల్లో పెట్టుకుని చూడాలని భావిస్తుంటారు. నేటి ఆధునిక సమాజంలో చాలా మంది పిల్లలు తమ తల్లితండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూడక పోవడంతో తల్లితండ్రులు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. చిన్న పలకరింపును కోరుకునే వయసు వారిది. ఆత్మీయుల ఎంతగానో ఎదురుచూపులు చూసే మనసు వారిది. ఈరోజుల్లో ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు.
Read Also : JR NTR : నందమూరి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎన్టీఆర్..మోక్షజ్ఞ