MP Honour Killing: దారుణం.. యువకుడికి బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా వేసిన దుర్మార్గులు?
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. మనుషులు మానవత్వం అన్న మాటను మరిచి ఎదుటివ్యక్తిని అతి దారుణం
- By Anshu Published Date - 04:50 PM, Mon - 19 June 23

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. మనుషులు మానవత్వం అన్న మాటను మరిచి ఎదుటివ్యక్తిని అతి దారుణంగా నడిరోడ్డుపై హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో మనుషులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటన ఎంపీ మోరెనా జిల్లాలో జరిగింది.
ప్రేమించుకున్న జంటను నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపిన పెద్దలు మొసళ్లు తిరిగే నదిలో మేతగా పడేశారు. పిల్లలు కనిపించకుండా పోయారంటూ యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది.
రతన్‌బసాయ్ గ్రామానికి చెందిన శివాని తోమర్, పొరుగు గ్రామం బాలూపూర్‌కు చెందిన రాధేశ్యామ్ తోమర్ ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు వాళ్ల బంధానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జూన్ 3వ తేదీన వాళ్లను కాల్చి చంపేసి ఆ మృతదేహాలకు బండరాళ్లు కట్టి మొసళ్లు తిరిగే చంబల్ నదీ ప్రాంతంలో పడేశారు.
అయితే కొడుకు అతను ప్రేమించిన అమ్మాయి కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మొదటవాళ్లు ఎక్కడికైనా పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. అయితే వాళ్లు వెళ్లిపోవడం ఎవరూ చూడకపోవడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులను పిలిచి గట్టిగా విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. కొంతమంది సహాయంతో ముక్కలైన వాళ్ల మృతదేహాలను వెలికి తీశారు స్థానిక పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంతటి దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు నమోదు చేశారు.