MLA Kranthi: కబడి కబడి కబడి అంటూ గ్రామాల్లో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
రాష్ర్టంలో క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఎమ్మెల్యే క్రాంతికిరన్ క్రీడా మైదానాలను ప్రారంభించారు.
- By Hashtag U Published Date - 11:12 PM, Thu - 9 June 22

రాష్ర్టంలో క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఎమ్మెల్యే క్రాంతికిరన్ క్రీడా మైదానాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే క్రాంతికిరన్ మంతురూ, సింగూర్,బస్వపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డి తో కలిసి క్రీడా మైదానాన్ని ప్రారంభించారు.అనంతరం క్రీడా మైదానంలో కబడ్డీ ఆడుతూ అందరి దృష్టి ని ఆకర్షించారు.
ఎమ్మెల్యే గ్రామ యువకులతో కలిసి ఆటలు ఆడడం సరదాగా ఉందని ఎమ్మెల్యే ఆట తీరును చూసిన వారంటున్నారు. గ్రామ గ్రామాన క్రీడా మైదానాలను పొంపొందించడం వల్ల క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ క్రీడా మైదానాలు ఉపయోగపడతాయన్నారు.క్రీడలు ఆడడం వల్ల యువత ఉల్లాసంగా ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు.ప్రతి గ్రామంలో ఒక ఎకరం స్థలంలో 4 లక్షల రూపాయల వ్యయంతో క్రీడాప్రాంగణాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే క్రాంతికిరన్ అన్నారు.