Meta Layoff: ఉద్యోగం కోసం ఇండియా నుంచి యూకేకి.. కానీ రెండు నెలల్లోనే అలా?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐటి ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఎప్పుడు ఏ క్షణం ఎవరి ఉద్యోగాల్లో పోతాయో తెలియడం లేదు
- By Nakshatra Published Date - 07:17 PM, Mon - 29 May 23
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐటి ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఎప్పుడు ఏ క్షణం ఎవరి ఉద్యోగాల్లో పోతాయో తెలియడం లేదు. మరి ముఖ్యంగా ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అయినా మెటా, గూగుల్,అమెజాన్ ట్విట్టర్,మైక్రోసాఫ్ట్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను పీకి పారేస్తున్నారు. ఇప్పటికే ఫేస్బుక్ వాట్సాప్, ఇంస్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా మూడో విడతగా చివరి లేఆప్స్ ను ప్రకటించింది. దాదాపు 6వేల మంది ఉద్యోగులను తీసేస్తోంది. ఇందులో ఇండియాలో పని చేస్తున్న వారు కూడా ఉన్నారు.
ఈ ఏడాది మార్చి నెలలో 4,000 మందిని తొలగించిన మెటా ప్రస్తుతం 6000 మందిని తీసేస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రముఖ వెబ్సైట్ లింక్డ్ ఇన్ ఉద్యోగాలు కోల్పోయిన వారు వారి బాధలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగాక ఉద్యోగి భారతదేశం నుంచి యూకే కి వెళ్ళాడు. తాజా మెటా లే ఆఫ్స్‌లో జాబ్ ను కోల్పోయాడు. తాను యూకే కి వెళ్ళి 2 నెలలు మాత్రమే అవుతున్నప్పుడు తెలిపాడు. మెటాలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న ఉద్యోగి ప్రస్తుతం తన జాబ్ కోల్పోయాడు. ప్రస్తుతం తన జాబు పోయిందని, తన ప్రస్తుతం కొత్త అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నానని, యూకే యూరప్ ఇండియాలో ఎక్కడైనా పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ పోస్టులో వెల్లడించాడు.
ఇలా కేవలం ఆ ఒక్క వ్యక్తి పరిస్థితి మాత్రమే కాకుండా చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా వారి గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరొక ఉద్యోగం కూడా తన బాధను పంచుకున్నారు. న్యూ జెర్సీలో తన సోదరుడి కాన్వకేషన్ కు హాజరైన సమయంలో తన తొలగింపు గురించి తెలుసుకున్నట్లు సదరు మహిళా ఉద్యోగి వెల్లడించింది. ఉద్యోగం కోసం న్యూ జెర్సీ నుంచి కాలిఫోర్నియా వెళ్లిన ఏడాది తర్వాత తనకు పింక్ స్లిప్ ఇచ్చినట్లు వెల్లడించింది. వృత్తిపరంగా మెటాలో తనకు ఏడాది పాటే పని చేసే అవకాశం వచ్చిందని, కానీ అది జీవితాంతం గుర్తుండిపోయి అనుభవాలను ఇచ్చిందని ఆమె తెలిపింది.
Related News
London Stabbings: పోలీసులే లక్ష్యంగా లండన్ లో వ్యక్తి కత్తులతో వీరంగం
లండన్ లో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్‌లో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. ప్రజలపై మరియు పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.