Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం
ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున 3 గంటలకు క్లబ్‌లో భారీ ఎత్తును మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..
- By Hashtag U Published Date - 09:46 AM, Sun - 16 January 22

ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున 3 గంటలకు క్లబ్‌లో భారీ ఎత్తును మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..
10 ఫైరింజన్లు దాదాపు నాలుగైదు గంటలుగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ఇంకా చాలా సమయం పట్టవచ్చునని చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించినప్పటికీ సుమారు రూ.20 కోట్లు మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. శనివారం (జనవరి 15) సంక్రాంతి పండగ కావడంతో క్లబ్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో పెను ముప్పు తప్పిందంటున్నారు. సికింద్రాబాద్ క్లబ్ జూబ్లీ బస్టాండ్‌కు దగ్గరగా ఉండటంతో.. ప్రస్తుతం అక్కడ వాహనాల రాకపోకలు నిలిపివేసినట్లు సమాచారం. అల్వాల్, బొల్లారం, శామీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/Ashi_IndiaToday/status/1482561428121075712
1878లో బ్రిటీష్ హయాంలో మిలటరీ అధికారులు కోసం ఈ క్లబ్ నిర్మించిన విషయం తెలిసిందే. దాదాపు 20 ఎకరాల విస్తీరణంలో సికింద్రాబాద్ క్లబ్‌ను నిర్మించారు. సంక్రాంతి కావడంతో శనివారం క్లబ్‌ను ముసివేసినట్లు తెలుస్తోంది.