Hyderabad:హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది.చాంద్రాయణగుట్టలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదాములో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది
- By Praveen Aluthuru Published Date - 01:07 PM, Mon - 11 December 23
Hyderabad: హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది.చాంద్రాయణగుట్టలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదాములో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో నివాసముంటున్న స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అయితే ఈ భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
Also Read: Sandeep Vanga: జాక్ పాట్ కొట్టిన యానిమల్ డైరెక్టర్.. ఏకంగా 200 కోట్లు!