Noida Fire: నోయిడాలో భారీ అగ్నిప్రమాదం, మూడు అంతస్థులపై నుంచి దూకి!
నోయిడా గెలాక్సీ ప్లాజాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాజాలో భారీగా మంటలు చెలరేగడంతో చాలా మంది లోపల చిక్కుకుపోయారు.
- By Praveen Aluthuru Published Date - 03:27 PM, Thu - 13 July 23
Noida Fire: నోయిడా గెలాక్సీ ప్లాజాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాజాలో భారీగా మంటలు చెలరేగడంతో చాలా మంది లోపల చిక్కుకుపోయారు. అయితే కొందరు ప్రాణాలను కాపాడుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. మూడు అంతస్థులపై నుంచి కిందకి దూకారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది.
Greater Noida के गैलेक्सी प्लाजा में लगी भीषण आग।@noidapolice pic.twitter.com/XAa6gI345s
— Nitin Yadav (@nitinyadav9258) July 13, 2023
గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ కొత్వాలిలో ఉన్న గెలాక్సీ ప్లాజాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక అధికారులు చెప్తున్నారు. అయితే ఇద్దరు పిల్లలతో పాటు మరికొంత మంది గెలాక్సీ ప్లాజాలోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా అగ్నిమాపక శాఖకు చెందిన 3 వాహనాలు సహాయక చర్యలు చేపట్టాయి. అద్దాలు పగులగొట్టి పొగను బయటకు పంపుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read More; Hyderabad: లైంగిక వేధింపులకు అడ్డాగా మారిన కేబీఆర్ పార్క్