Varanasi Railway Station : వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
Varanasi Railway Station : గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), స్థానిక పోలీసు బృందంతో పాటు 12 ఫైర్ బ్రిగేడ్ వాహనాలతో మంటలను ఆర్పేశారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సమాచారం.
- By Sudheer Published Date - 12:52 PM, Sat - 30 November 24

వారణాసి కాంట్ రైల్వే స్టేషన్(Varanasi Railway Station)లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Massive Fire Breaks) చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), స్థానిక పోలీసు బృందంతో పాటు 12 ఫైర్ బ్రిగేడ్ వాహనాలతో మంటలను ఆర్పేశారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఈ ఘటనలో దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని అధికారులు చెప్పారు. రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ప్రయాణీకులకు అసౌకర్యం కలగడంతో పాటు వారి వాహనాలు నష్టపోవడం ఆందోళన కలిగించింది. ప్రభుత్వం బాధితులకు సహాయం అందించేందుకు చర్యలు చేపట్టింది.
Read Also : Acohol In Winter : చల్లని వాతావరణంలో మద్యం సేవించడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి..!