Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్ మీట్.. జర్నలిస్ట్ దాడి సంఘటనపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్?
మంచు కుటుంబం వివాదం మరింత సంక్లిష్టంగా మారుతోంది. మనోజ్, మోహన్ బాబు, విష్ణు తమ మధ్య తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
- Author : Kode Mohan Sai
Date : 11-12-2024 - 1:19 IST
Published By : Hashtagu Telugu Desk
Manchu Vishnu: మంచు కుటుంబం వివాదం రోజురోజుకు మరిన్ని మలుపులు తిరుగుతోంది. మనోజ్, మోహన్ బాబు, విష్ణు పరస్పర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందుగా, మనోజ్ మీడియాతో మాట్లాడినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఆయన ఈ రోజు సాయంత్రం మరింత కీలక సమాచారం వెల్లడిస్తానని ప్రకటించారు. తాజాగా, విష్ణు కూడా మీడియా ముందు వచ్చి, సంచలన వ్యాఖ్యలు చేసారు.
“మా అమ్మకి ఈ రోజు ఆరోగ్యం బాగోలేదు. మా నాన్న నిన్నటి గొడవ కారణంగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. నేను ప్రస్తుతం కన్నప్ప షూటింగ్‌లో ఉన్నాను, కానీ గొడవల వల్ల నేను షూటింగ్ నిలిపి వచ్చాను. ఫస్ట్ ఫ్యామిలీ ముఖ్యం అన్న దృఢనిశ్చయంతో వచ్చాను. నిన్న ఒక జర్నలిస్టు గాయపడ్డాడు. అది చాలా దురదృష్టకరం. దానికి చింతిస్తున్నాం. నిన్న తండ్రిగా ఆయన తపన చూడండి. దండం పెడుతూ మీడియా ముందుకు వస్తుంటే ఆయనకి లోగో మొహం మీద పెట్టారు అని కోపంతో అలా చేశారు. అలా జరిగి ఉండకూడదు. మాకు నోటీసులు రాకముందు పోలీసులు మీడియాకి విడుదల చేసారు. అది ఎలా సాధ్యం అవుతుంది. ఈరోజు ఉదయం గన్ సబ్మిట్ చెయ్యాలని చెప్పారు. మీడియాలో నిన్న విడుదల చేశారు. ఇవ్వాళ 9.30కి నోటీసు ఇచ్చి పదిన్నరకి హాజరు కావాలని అంటే ఎలా?’ అని విష్ణు ప్రశ్నించారు.
“జర్నలిస్టుపై దాడి చాలా విచారకరం. ఆ దాడిని నేను ఖండిస్తున్నాను. మా నాన్న తప్పు చేసినట్లయితే, అతనిని క్షమించాలి. ఆయన ఎప్పుడూ మీడియాతో చాలా గౌరవంగా ఉంటారు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు. సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి. చివరికి అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించటమే మా నాన్న చేసిన తప్పు. మేం కలిసిమెలసి ఉందామని అనుకున్నాం. నిన్నటి దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆస్సత్రి పాలైంది. గేట్లు పగలగొట్టి మనోజ్ ఇంట్లోకి వచ్చాడు.’ అని విష్ణు అన్నారు.