Saami Saami in NYC Streets: స్కర్ట్ వేసుకొని సామి సామి అంటూ కుర్రాడి డ్యాన్స్..నెట్టింట్లో వైరల్..!!
పుష్ప సినిమాలోని "సామి సామి" సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
- By Hashtag U Published Date - 06:00 AM, Thu - 14 April 22

పుష్ప సినిమాలోని “సామి సామి” సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటపై ఎంతో మంది వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రెండింగ్ లోనూ నిలిచాయి. తాజాగా ఈ పాటకు ఓ యువకుడు..అమ్మాయిలు ధరించే స్కర్టు వేసుకుని…వేసిన స్టేప్పులు నెటిజన్ల ఫిదా చేశాయి. చాలా హుషారుగా ఫుల్ ఎనర్జిటిగ్గా డ్యాన్స్ వేశాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
భారత కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా తరచూ అమ్మాయిల్లా డ్రెస్సులు వేసుకుని అమెరికాలో డ్యాన్సులు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ డ్యాన్సులు బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు వాటిని అమెరికాలో ప్రదర్శిస్తూ..ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు షేర్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తూనే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటాడు. ఇప్పుడు లేటెస్టుగా స్కర్ట్ ధరించి…అమెరికా వీధుల్లో పుష్ప మూవీలోని సామి సామి సాంగ్ కు డ్యాన్స్ ఇరగదీశాడు. ఈ వీడియో మామూలుగా వైరల్ కాలేదు.