News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Major Trailer Mahesh Babu Salman Khan And Prithviraj Are Impressed By Adivi Seshs Movie About A Braveheart

Mahesh Babu: మేజర్ చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి!

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • By Balu J Updated On - 10:21 PM, Mon - 9 May 22
Mahesh Babu: మేజర్ చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి!

డైనమిక్ హీరో అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. 2.28 నిమిషాలు గా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ సాగింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా వుంది. ట్రైలర్ లో 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. అడివి శేష్ మేజర్ సందీప్ గా పరకాయ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజ్ వాయిస్ ,డైలాగ్స్ , ఆయన నటన అద్భుతంగా వుంది.

”మై సన్ ..

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ..

వెనకడుగు వేసే అవకాశం వుంది

తప్పించుకునే దారి వుంది

ముందు వెళితే చనిపోతాడని తెలుసు .. అయినా వెళ్ళాడు

చావు కళ్ళల్లో చూసి.. ‘నీవు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ దేశాన్ని కాదు’ అన్నాడు”… ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ డైలాగ్, దాని తగ్గటు చూపించిన సందీప్ పోరాటానికి చప్పట్లు కొట్టాల్సిందే.

సినిమా పై భారీ అంచనాలు పెంచిన మేజర్ ట్రైలర్ .. సినిమాని ఎప్పుడు చూస్తామా ? అనే ఆసక్తిని పెంచింది.

అభిమానుల సమక్షంలో విడుదల చేసిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ… మేజర్ టీమ్ ని చూస్తే గర్వంగా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమషాల మౌనం తర్వాత శేష్ ని హాగ్ చేసుకున్నాను. బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నది, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ భాద్యత ఇంకా పెరుగుతుంది. మేజర్ టీం మొత్తం ఆ భాద్యతని చక్కగా నిర్వహించారు. రెండేళ్ళుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన మేజర్ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న మేజర్ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా గా కూడా అద్భుతంగా ఉండబోతుంది.” అన్నారు

హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మ్యాన్. అమ్మనాన్న, స్నేహితులు, చైల్డ్ హుడ్ క్రష్, గర్ల్ ఫ్రండ్ ఇలా మనందరిలానే అతని జీవితం కూడా సాధారణం. ఐతే అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారనేది మేజర్ లో చూస్తారు. మహేష్ గారు మేజర్ సినిమాకి బ్యాక్ బోన్. ఏం జరిగినా మహేష్ గారు వున్నారనే ఒక నమ్మకం. కోవిడ్ లాంటి కష్టకాలంలో మహేష్, నమ్రతగారే మమ్మల్ని నిలబెట్టారు. అబ్బూరి రవి గారి కి కూడా స్పెషల్ థ్యాంక్స్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కోరిక ఒక్కటే. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఎప్పటిక్కీ నిలిచిపోవాలని కోరుకున్నారు. మేజర్ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది’’ అని అన్నారు.

దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. 2018లో అడవి శేష్ ఈ కథ చెప్పారు. నేను కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై రీసెర్చ్ చేశాను. ఇలాంటి గొప్ప కథ ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకున్నాను. మహేష్ గారు మా వెనుక వుండటం ఒక ప్రత్యేకమైన బలం. నమ్రత గారు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. అడివి శేష్ తో రెండు సినిమాలు చేశాను. అతని గురించి ఒక పుస్తకం రాయొచ్చు. కష్టపడటంలో శేష్ తో పోటిపడితే చాలు మనం విజయం సాధించినట్లే. ప్రకాష్ రాజ్, రేవతి గారు అద్భుతంగా చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ ని కలిసినప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యానో.. మానిటర్ లో ప్రకాష్ రాజ్, రేవతి గార్ల నటన చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నా యూనిట్ మొత్తానికి స్పెషల్ థ్యాంక్స్” అన్నారు

హీరోయిన్ సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ.. మేజర్ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. మహేష్ బాబు గారికి నమ్రత మేడమ్ కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే సోనీ పిక్చర్స్ కి కూడా ధన్యవాదాలు . హీరో అడివి శేష్, దర్శకుడు శశి గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. మేజర్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఆనందంగా వుంది. ప్రతి ఒక్కరు జూన్ 3న థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Tags  

  • latest tollywood news
  • mahesh babu
  • major
  • trailer released

Related News

Mahesh Dance: మహేశ్ మాస్ డాన్స్.. వీడియో వైరల్

Mahesh Dance: మహేశ్ మాస్ డాన్స్.. వీడియో వైరల్

మహేశ్‌ హీరోగా దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ మీట్‌ను కర్నూలు ‘యస్‌.టి.బి.టి’ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించారు. 

  • Mahesh Babu: సర్కారు వారి విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

    Mahesh Babu: సర్కారు వారి విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

  • Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల  ఖుషి!

    Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల ఖుషి!

  • Sai Pallavi: మహేశ్ కోసం మారువేశం!

    Sai Pallavi: మహేశ్ కోసం మారువేశం!

  • Naga Chaitanya: ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌!

    Naga Chaitanya: ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌!

Latest News

  • North Korea: ఉత్తర కొరియా శవాల దిబ్బగా మారుతుందా?

  • Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

  • Summer Health Drink: మజ్జిగలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే ప్రయోజనాలు ఇవే..వేసవిలో అద్భుతమైన డ్రింక్…

  • Lakshmi Puja: మే 20 జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..అప్పులు తీరి, సకల సంపదలు చేకూరుతాయి…

  • Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!

Trending

    • Angry Bride: వికటించిన డీజే, ముహూర్తానికి మండపం చేరుకోని వరుడు, కోపం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు…

    • Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!

    • Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: