Liquor Prices: తెలంగాణలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్…పెరిగిన మద్యం ధరలు..!!
మందుబాబులకు తెలంగాణ సర్కార్ ఝలక్ ఇచ్చింది.
- Author : Hashtag U
Date : 19-05-2022 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
మందుబాబులకు తెలంగాణ సర్కార్ ఝలక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచేసింది. ఒక్కో బీరుపై రూ. 20 పెంచిన ప్రభుత్వం…బ్రాండ్ తో సంబంధం లేకుండా క్యార్టర్ పై 20 రూపాయలు పెంచింది. బ్రాండ్ తో నిమిత్తం లేకుండా ప్రతి హాఫ్ బాటిల్ పై 40 రూపాయలు, ఫుల్ బాటిల్ పై ధరను 80రూపాయలు పెంచేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. మద్యం ధరలను పెంచిన నేపథ్యంలో బుధవారం రాత్రి మద్యం విక్రయాల గడువు ముగిసిన వెంటనే…ఆయా దుకాణాల్లోని మద్యంను అధికారులు సీజ్ చేశారు. గురువారం నుంచి పెరిగిన మద్యం రేట్లు అమల్లోకి రానున్నాయి.