Rain Alert Today : ఇవాళ వర్షాలు తక్కువే.. రేపు ఈ జిల్లాల్లో మాత్రం భారీగా
Rain Alert Today : ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
- By Pasha Published Date - 07:35 AM, Sun - 30 July 23

Rain Alert Today : ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 1న మాత్రం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిరర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇక హైదరాబాద్ లో(Rain Alert Today) ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది.
Also read : Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి, 115 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్ లో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వాతావరణ విభాగం అధికారులు చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయల సీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే ఛాన్స్ ఉందన్నారు.