Yasin Malik: యాసిన్ మాలిక్ కు రెండు యావజ్జీవ శిక్షలు
జమ్ముకశ్మీర్ వేర్పాటువాది , జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) నేత యాసిన్ మాలిక్‌కు రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి.
- By Hashtag U Published Date - 07:59 PM, Wed - 25 May 22

జమ్ముకశ్మీర్ వేర్పాటువాది , జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) నేత యాసిన్ మాలిక్‌కు రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. ఇందులో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. 10 లక్షల రూపాయల జరిమానా కూడా కోర్టు విధించింది.
ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చిన కేసులో ఢిల్లీ పటియాలా కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ఉగ్రవాదులు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్ ను ఈనెల 19నే న్యాయస్థానం దోషిగా తేల్చింది. యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్షే సరి అని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. కోర్టు వాదనలు జరుగుతున్న సమయంలో యాసిన్ మాలిక్ మాట్లాడారు.
“నేను క్రిమినల్ అయితే.. అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వం ఎందుకు పాస్‌పోర్ట్ ఇచ్చింది. నేను గాంధీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాను. కశ్మీర్ లోయలో అహింసతో కూడిన రాజకీయాలు చేస్తున్నాను” అని వాదన సమయంలో మాలిక్ చెప్పుకొచ్చారు.