Devotional Lamp: అనుకున్నది సాధించాలంటే..!
సాధారణంగా చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు ఏది
- Author : Anshu
Date : 19-07-2022 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు ఏది అనుకున్న జరగకపోవడం, వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు కావడంతో దిగాలు చెందుతూ బాధపడుతూ ఉంటారు. అయితే అనుకున్న పనులు జరగకపోవడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, తరచూ ఎదో ఒక గొడవలు జరుగుతూ ఉండడం, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండకపోవడం అన్నవి గ్రహ దోషాలు, పూర్వజన్మకృతాలు, గోచారం, వాస్తు ఇలా ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. అయితే అటువంటి సమయంలో పండితులు చెప్పే వాటిని పాటించడం వల్ల అటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఇందుకోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేయాల్సి ఉంటుంది. కాగా దీపం పెట్టడం అన్నది జ్ఞానాన్ని వెతకడం లాంటిది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాగా ప్రస్తుతం సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న వృక్షం రావి చెట్టు. దీనినే అశ్వర్ధ వృక్షం అని కూడా అంటారు. ఈ రావి చెట్టులో అనేక ఆధ్యాత్మికతకు సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావి చెట్టు మన పూర్వ జన్మ కర్మలను కూడా తొలగించగలదు. అదేవిధంగా శాపాలు దోషాలను గ్రహ పీడలను కూడా నివారించగలదు.
అందుకోసం మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. రావి చెట్టును పూజించడంతోపాటుగా ఆ రావిచెట్టు ఆకులతో ఇంట్లో దీపాన్ని వెలిగించడం వల్ల శాప దోశ కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకోసం మనం చేయాల్సిందే రావిచెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై దీపం ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలా చేసిన వారికి కార్యాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అలాగే రావి ఆకులను భగవత్ స్వరూపంగా భావించి విష్ణు నామస్మరణ అంటే ” ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ” అనే మంత్రాన్ని పటిస్తూ దీపం పెడితే చాలు. దాని ఫలితాలు కొన్ని వారాలలోనే మనకు కనిపిస్తాయి.