Medchal : కల్తీ పాలు అమ్ముకుంటున్నావంటూ మంత్రి మల్లారెడ్డి ఫై KLR ఆగ్రహం
గత ఎన్నికల్లో నాకు TRS టికెట్ ఇస్తానంటే నా మనసక్షి ఒప్పుకోక వెళ్ళలేదు. అందుకే మల్లా రెడ్డికి ఎమ్మెల్యే
- By Sudheer Published Date - 02:37 PM, Fri - 4 August 23

బిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ఫై కేఎల్ఆర్ (లక్ష్మారెడ్డి) ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను రాజకీయాల్లో ఉన్నపుడు నువ్వు స్కూటర్ పైన కల్తీ పాలు అమ్ముకుంటున్నావని మల్లారెడ్డి కి చురకలు అంటించారు. జోకర్ బ్రోకర్ మాటలు ప్రజలు నమ్మవద్దని కోరారు. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కోవడం కాదు..ప్రజలకు సేవచేసెందుకే రాజకీయాల్లోకి వచ్చానని KLR స్పష్టం చేసారు.
మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఇదొక కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక సోషల్ మీడియా లో అయితే చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లాడి దగ్గరి నుండి పెద్దవారి వరకు మల్లారెడ్డి కి ఫ్యాన్స్ ఉన్నారు. పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. అన్న డైలాగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. ఒక్కోసారి మల్లారెడ్డి చేసే కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కూడా మారుతుంటాయి. అలాంటి వ్యాఖ్యలే మరోసారి చేశారు మంత్రి మల్లారెడ్డి.
నిన్న గురువారం నుండి తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ లాబీలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. మేడ్చల్ నియోజకవర్గం (Medchal Constituency)లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తానే నిర్ణయిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో కేఎల్ఆర్ (లక్ష్మారెడ్డి)కి తానే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తానే డిసైడ్ చేస్తానని అన్నారు. ఈ సారి కూడా తన గెలుపును ఎవరూ ఆపలేరని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై KLR స్పందించారు.
నేను రాజకీయాల్లో ఉన్నపుడు నువ్వు స్కూటర్ పైన కల్తీ పాలు అమ్ముకుంటున్నావని మల్లారెడ్డి ఫై చురకలు వేశారు. జోకర్ బ్రోకర్ మాటలు ప్రజలు నమ్మవద్దని కోరారు. మంత్రి మల్లా రెడ్డి నాకు టికెట్ ఇప్పించడం కాదు.. గత ఎన్నికల్లో నాకు TRS టికెట్ ఇస్తానంటే నా మనసక్షి ఒప్పుకోక వెళ్ళలేదు. అందుకే మల్లా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నారు. పిచ్చి మల్లా రెడ్డిని ఓడగొట్టటానికే మేడ్చల్ జిల్లాలో తిరుగుతున్నా..MLA గా పోటీ చేస్తానని ఎక్కడ చెప్పలేదని తెలిపారు.మంత్రి మల్లారెడ్డిని చిత్తు చిత్తుగా ఓడగొడతామని ఈ సందర్బంగా సవాల్ చేస్తున్నట్లు KLR తెలిపారు.మరి KLR సవాల్ కు మల్లారెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Read also AP : మంత్రి అప్పలరాజు వల్ల జగన్ కు కొత్త సమస్య ఎదురుకాబోతుందా..?