KGF Ganesh: వినాయకుడిగా కేజీఎఫ్ హీరో.. జైకొడుతున్న భక్తులు
సినిమా హీరోల ప్రభావం వినాయకుడిపై కూడా పడింది.
- By Balu J Published Date - 08:59 PM, Fri - 2 September 22

సినిమా హీరోల ప్రభావం వినాయకుడిపై కూడా పడింది. ఈ ఏడాది వివిధ హీరోల గెటపుల్లో వినాయక విగ్రహాలు దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురంభీం, అల్లూరి సీతరామరాజు ఫొటోలు వైరల్ కాగా, తాజాగా కేజీఎఫ్ సినిమా కథాంశంతో హైదరాబాద్‌లోని గౌలిబస్తీలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా యశ్ ప్రతిమను సైతం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి భక్తులు ముగ్ధలవుతున్నారు