HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Keeping Kcr As Target Bjp State Chief Completes 100kms Of Yatra

Bandi 100 kms: ‘కేసీఆరే’ టార్గెట్ గా 100 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న ‘బండి సంజయ్’ పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారంతో 10 రోజులు పూర్తి చేసుకుంది.

  • By Hashtag U Published Date - 10:13 PM, Sat - 23 April 22
  • daily-hunt
Bandi Imresizer
Bandi Imresizer

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారంతో 10 రోజులు పూర్తి చేసుకుంది. ఈరోజు ఉదయం కిష్టంపూర్ చౌరస్తాకు రాగానే 100 కి.మీలు పూర్తి చేసుకున్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో అలంపూర్ లో ప్రారంభమైన పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది.

జోగులాంబ జిల్లాలోనే బండి సంజయ్ 9 రోజులపాటు పాదయాత్ర చేశారు. నవ రాత్రులు జోగులాంబ జిల్లాలోనే బస చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజు ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయే దాకా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మధ్యలో కొంత సేపు భోజన విరామం. గతంలో పెద్ద పెద్ద బహిరంగ సభలకు ప్రాధాన్యతనిచ్చిన బీజేపీ ఈసారి మాత్రం ‘ప్రజల గోస – బీజేపీ భరోసా’ పేరిట ప్రతిరోజు సగటున మూడు, నాలుగు గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు.
ఇక సమస్యల విషయానికొస్తే.. నడిగడ్డలో పాదయాత్ర చేసినన్ని రోజులు ఎక్కడ చూసినా రైతులు కలిసి నడిగడ్డ దుస్థితిని వివరించారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఆర్డీఎస్ ఆధునీకరణ, లిఫ్ట్ ల ఏర్పాటే శరణ్యమని ఆ దిశగా కృషి చేయాలని కోరుతూ అనేక వినతులు వచ్చాయి. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున కుల సంఘాల నాయకులు తరలివచ్చి బండి సంజయ్ కు తమ గోడు విన్పించారు. తొలిరోజు నుండి 10వ రోజు దాకా ఎక్కడ పాదయాత్ర చేసినా మాదాసు కురవ, వాల్మీకీ బోయ సామాజికవర్గ నాయకులు, ప్రజలు వచ్చి తమకు కేసీఆర్ చేసిన అన్యాయాన్ని వివరిస్తూ తమ సమస్యలకు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు.

వీరితోపాటు యాదవులు, విశ్వకర్మలు, ముదిరాజ్, మున్నూరు కాపు కులస్తులు తరలివచ్చి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. మండుటెండలో చెమటలు కక్కుతున్నా… ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పట్టించుకోకుండా దారి పొడవునా ప్రజలను కలుస్తూ వారి బాధలు వింటూ… నేనున్నా… బీజేపీ అండగా ఉంటుంది అంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. సాయంత్రం పూట పాదయాత్రలో దారి వెంట దుకాణాల వద్దకు వెళ్లి చాయ్ పే చర్చ పేరిట యువకులు, వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులు సైతం ఈ యాత్రకు పెద్ద ఎత్తున తరలివస్తూ సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొనడం విశేషం.

రెండో విడత పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ సింగ్ పటేల్ తో పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై వచ్చి బండి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ పాదయాత్ర చేశారు. ముఖ్యంగా ప్రజల నుండి విశేష స్పందన వస్తున్న తరుణంలో యాత్రకు ఆటంకాలు కల్పించేందుకు టీఆర్ఎస్ నేతలు అక్కడక్కడా నిరసనలు, రాళ్ల దాడులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్ల దాడికి, నిరసనలకు బెదరకుండా బండి సంజయ్ ప్రజలను కలిసి వారి బాధలు వినడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ పాదయాత్రను కొనసాగిస్తుండటం గమనార్హం.
ప్రవాసీయులు సైతం….:
విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసీయులు సైతం బండి సంజయ్ కు మద్దతు తెలుపుతుండం విశేషం. 10వ రోజు పాదయాత్రలో భాగంగా సుమారు 50 మంది ప్రవాసీయులు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో నడిచారు. నంగి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర శిబిరం వద్ద 2వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో ప్రవాసీయుల పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రవాసీయులు విదేశాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు రావడంపట్ల ధన్యవాదాలు తెలిపారు.

 

 

Live: Day 10 of #PrajaSangramaYatra2 https://t.co/lvVp7yDri4

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 23, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • Telangana BJP
  • telangana CM

Related News

Cm Revanth Reddy

CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.

    Latest News

    • Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆట‌గాడు ఎవ‌రంటే?

    • CM Revanth: దక్షిణ భారత కుంభమేళా.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

    • Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం

    • Engineering Colleges : సోమవారం నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్?

    • Asia Cup 2025: ఎల్లుండి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. పిచ్ ప‌రిస్థితి ఇదే!

    Trending News

      • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

      • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

      • Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

      • Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!

      • Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd