Birju Maharaj: లెజెండరీ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
ప్రముఖ కథక్ నాట్యాచార్యులు, పద్మ విభూషణ్ గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు.
- Author : Hashtag U
Date : 17-01-2022 - 9:28 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ కథక్ నాట్యాచార్యులు, పద్మ విభూషణ్ గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. భారత దేశంలో నాట్య రంగానికి చెందిన అత్యుత్తమ కళాకారుల్లో ఆయన ఒకరు. బిర్జు మహారాజ్‌ను ఆయన శిష్యులు పండిట్ జీ, మహారాజ్ జీ అని పిలుస్తుంటారు. అందిన సమాచారం ప్రకారం.. బిర్జు మహారాజ్ ..
రాత్రి మనవళ్లతో ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి, అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్ది రోజుల నుండి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. బిర్జు మహారాజ్ తండ్రి, మేనమామలు సైతం కథక్ నాట్యకళాకారులే. పండిట్ కేవలం నాట్య కళాకారులే కాదు..
అద్భుతంగా తబల వంటి పరికరాలు అద్భుతంగా వాయించడమే కాకుండా…పాటలు కూడా చక్కగా పాడతారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో ఘరానాలో 1938 ఫిబ్రవరి 4న బిర్జూ మహారాజ్ జన్మించారు. ఆయన అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. ఆయన ప్రతిభ గుర్తింపుగా చాలా అవార్డులు పొందారు. అతను సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్ పొందాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం , ఖైరాగఢ్ విశ్వవిద్యాలయాలు కూడా బిర్జు మహారాజ్‌కు డాక్టరేట్‌లతో గౌరవించాయి.