Kalaavathi Song: కళావతి పాట.. రికార్డుల మోత!
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట విడుదలకే ముందే అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమాపై ఇంత హైప్ రావడానికి థమన్ సంగీతం చాలా కీలకం.
- By Balu J Published Date - 05:38 PM, Tue - 26 April 22
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట విడుదలకే ముందే అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమాపై ఇంత హైప్ రావడానికి థమన్ సంగీతం చాలా కీలకం. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదల అయిన కళావతి అనే మెలోడీ పాట అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో 2 మిలియన్ లైక్‌లతో ఇప్పటివరకు 150 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో నిజానికి అత్యంత వేగంగా 150 మిలియన్ల మార్కును చేరుకున్న మొదటి పాట. ఈ పాట చాలా కాలంగా యూట్యూబ్‌లో టాప్ ట్రెండ్‌లో ఉంది. ఇప్పటికీ ఆడియో స్ట్రీమింగ్ లో టాప్ లో ఉంది. ఈ సందర్భంగా కళావతి పాటలోని కొత్త స్టిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మహేష్ బాబు ఒక చేతిలో పెన్నీ (కరెన్సీ), మరో చేతిలో పర్సుతో కనిపిస్తున్నాడు. పెన్నీ సాంగ్, టైటిల్ ట్రాక్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. మిగిలిన పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు టీమ్. పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట మే 12న థియేటర్లలోకి రానుంది.
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�