HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kalaavathi Song From Superstar Mahesh Babus Sarkaru Vaari Paata Unveiled

Sarkaru Vaari Paata: కళావతి కళావతి.. కల్లోల్లం అయ్యిందే నా గతి!

వరుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌తో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాటతో 2022లో త‌న‌ విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.

  • Author : Balu J Date : 13-02-2022 - 5:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalavati
Kalavati

వరుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌తో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాటతో 2022లో త‌న‌ విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌ర‌పరిచిన ఫ‌స్ట్‌ సింగిల్ కళావతి ప్రోమో ఇటీవ‌ల విడుద‌లై ఫుల్ సాంగ్ కోసం అంద‌రూ ఎదురు చూసేలా చేసింది. వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌గా ఈ రోజు కళావతి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్, సింగ‌ర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట ఈ ఏడాది మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచింది. ఈ పాటలో అన్ని ఫ‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. మహేష్ బాబు హుక్ స్టెప్ అద్భుతంగా ఉంది. అభిమానుల్లో పండుగ వాతావ‌ర‌ణాన్ని నెల‌కొలిపింది. సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు స్వాగ్‌, కీర్తి సురేష్ అందం అబ్బురపరిచేలా ఉంది. వారి కెమిస్ట్రీ ఈ పాటకు అదనపు గ్లామర్ జోడించింది. సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్ మ‌ధి విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

త‌మన్, సిద్ శ్రీరామ్ మరియు సంగీత బృందం సంప్రదాయ గెటప్‌లలో ప్రదర్శించిన ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజిక్ వీడియో ఈ పాటకు మ‌రింత అందాన్ని తెచ్చింది. కళావతి ఖచ్చితంగా మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు

సాంకేతిక బృందం

రచయిత, దర్శకుడు : పరుశురామ్ పెట్లా
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్స్ : మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫీ : ఆర్ మధి
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : ఏఎస్ ప్రకాష్
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్
కో డైరెక్టర్ : విజయ రామ్ ప్రసాద్
సీఈవో : చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : యుగంధర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kalaavathi Song
  • keerthy suresh
  • mahesh babu
  • Unveiled

Related News

Harish Shankar Mahesh

Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులే సమయం ఉండటంతో, ఇలాంటి వివాదాలు నెగిటివ్ టాక్‌కు దారితీయకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మహేష్ బాబు అభిమానుల వంటి పెద్ద వర్గం మద్దతు చాలా ముఖ్యం

  • Mahesh Babu Varanasi

    Vaaranasi Movie: మైండ్ బ్లాక్ అయ్యేలా ‘వారణాసి’ ఓవర్సీస్ హక్కుల ధర !!

Latest News

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd