HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jr Ntr And Koratla Siva Combo From February

Jr NTR: ఫిబ్రవరిలో సెట్స్ పైకి ‘ఎన్టీఆర్ – కొరటాల’ కాంబో మూవీ..!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది. హీరోకి, డైరెక్టర్ కి గనుక సింక్ అయితే... ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. సరిగ్గా అలాంటి ఓ కాంబినేషనే ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతోంది.

  • Author : Hashtag U Date : 31-01-2022 - 12:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jr Ntr And Siva
Jr Ntr And Siva

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది. హీరోకి, డైరెక్టర్ కి గనుక సింక్ అయితే… ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. సరిగ్గా అలాంటి ఓ కాంబినేషనే ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతోంది. అదేనండీ… జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్. వీరి కలయికలో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో మనకు తెలుసు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని 2016లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, బంపర్ హిట్ కొట్టారు. ఈ మూవీలో దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ నటనలోని కొత్త కోణాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు. అలాంటి ఈ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందుతుంది అంటేనే.. అంచనాలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు.

తాజాగా వీరి కాంబినేషన్ కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం చాలా ఆలస్యమైంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం… ఈ మూవీ ఫిబ్రవరి 7 నుంచి పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇప్పుడంతా పాన్ ఇండియా మేనియా కొనసాగుతున్న నేపధ్యంలో… ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక డైరెక్టర్ కొరటాల ఎప్పుడూ కూడా తన సినిమాల్లో సమాజానికి పనికొచ్చే ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాడు. ‘జనతా గ్యారేజ్’ లో ఎన్టీఆర్ ని పర్యావరణ ప్రేమికుడిగా చూపించిన కొరటాల శివ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను బస్తీకి చెందిన యువకుడిగా చూపించబోతున్నారు. బస్తీ విద్యార్థుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని టాక్. అవినీతితో కూడిన రాజకీయాలు, కరప్టెడ్ పొలిటీషియన్స్ ను ఎదుర్కొనే బలమైన విద్యార్థి నాయకుడి పాత్రలో ఎన్టీఆర్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఎవరు కథానాయికగా నటించనున్నారో త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పలువురు అగ్ర కథానాయికలనే సంప్రదించినట్లు తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ నే తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jr ntr
  • kalyan ram co producer
  • KOratla Siva
  • NTR30
  • shoot begins February

Related News

Jr NTR

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ ఈ సినిమా వాయిదా పడినట్లు జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

  • Jr Ntr Birthday Wishes To C

    Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd