Jharkhand : హత్యా లేక ఆత్మహత్యా? చెట్టుకు వేలాడుతూ మరో గిరిజన బాలిక శవం..!!
జార్ఖండ్ లో దారుణం జరిగింది. దుమ్కా జిల్లాలో ఓ గిరిజన బాలిక శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
- By hashtagu Published Date - 06:23 AM, Thu - 13 October 22

జార్ఖండ్ లో దారుణం జరిగింది. దుమ్కా జిల్లాలో ఓ గిరిజన బాలిక శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గడిచిన మూడు నెలల్లో దుమ్కాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది నాలుగోపారి. బాలిక శవం పూర్తిగా కుళ్లిపోయిన స్థితితో ఉంది. మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయం దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు.
కాగా బాలిక పదవ తరగతి విద్యార్థిని గుర్తించారు. దుమ్కాలో తన తోబుట్టువులతో కలిసి నివసిస్తోంది. ఓ యువకుడితో సంబంధం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంకిత హత్య కేసు తర్వాత దుమ్కాలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. జిల్లాలో మైనర్ సహా ఐదుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా లేదా హత్యకు గురయ్యారన్న విషయం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. దర్యాప్తులో హత్య ఆధారాలు లభిస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. గత మూడు నెలల్లో దుమ్కా జిల్లాలో ఇది నాలుగో ఘటన.