Shah Rukh Khan: హై ఇంటెన్స్ క్యారెక్టర్ లో షారుఖ్.. ‘జవాన్’ ఫస్ట్ లుక్ ఇదే!
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ సినిమా తెరకెక్కుతోంది.
- By Balu J Published Date - 05:11 PM, Fri - 3 June 22
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ సినిమా తెరకెక్కుతోంది. మేకర్స్ ఇవాళ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. షారుఖ్ ఖాన్(SRK) గాయాలతో ఎప్పుడు చూడని లుక్ లో కనిపించాడు. ఫేస్ మొత్తం బ్యాండేజీలతో నిండిపోయి మిషన్‌లో ఉన్నట్లుగా ఉన్నాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు, ఆయుధాలతో కూడిన బ్యాగ్‌తో షారుఖ్ కనిపించాడు. పోస్టర్‌ను బట్టి చూస్తే, జవాన్ హై ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో అట్లీ మార్క్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. షారూఖ్ ఖాన్ ఈ సినిమాలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్‌ని 5 భాషల్లో పాన్ ఇండియా విడుదల చేయనుంది. షారుఖ్ ఖాన్ దర్శకుడు అట్లీ ఇద్దరికీ మొదటి పాన్ ఇండియా చిత్రం. జూన్ 2, 2023న ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ విడుదల కానుంది.
Related News
Shah Rukh Khan : మోహన్‌లాల్, షారుక్ మధ్య స్వీట్ చిట్ చాట్.. ప్లేస్ మీరు చెప్తారా..? లేక నన్ను చెప్పమంటారా..?
మోహన్‌లాల్, షారుక్ మధ్య స్వీట్ చిట్ చాట్. ప్లేస్ మీరు చెప్తారా..? లేక నన్ను చెప్పమంటారా..? అంటూ..