HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Jagapathibabu Is A Typical Actor In A Key Role In The Gopichandsrivas Hat Trick Movie

Jagapathibabu: గోపిచంద్‌-శ్రీ‌వాస్ హ్యాట్రిక్ మూవీలో జ‌గ‌ప‌తిబాబు

ల‌క్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత హీరో గోపీచంద్ - ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే..

  • By Balu J Published Date - 01:27 PM, Mon - 14 February 22
  • daily-hunt
Jagapathibabu
Jagapathibabu

ల‌క్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత హీరో గోపీచంద్ – ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే.. గోపీచంద్‌ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి కో-ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విభిన్నమైన జానర్‌ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. ఈ మూవీలో ఒక కీల‌క పాత్ర‌లో విల‌క్ష‌ణ‌ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టించనున్నారు. ఈ రోజు జ‌గ‌ప‌తిబాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ల‌క్ష్యం త‌ర్వాత గోపిచంద్‌, శ్రీ‌వాస్‌, జ‌గ‌ప‌తిబాబు ల స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది. ఈ చిత్రానికి వెట్రి పళనిస్వామి కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండ‌గా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భూపతి రాజా కథ, వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాశారు. ఈ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలకు తగ్గట్టుగా శ్రీవాస్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతోన్నారు. మిగ‌తా విష‌యాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు.

నటీనటులు: గోపీచంద్, జ‌గ‌ప‌తి బాబు

సాంకేతిక బృందం

డైరెక్టర్: శ్రీవాస్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభోట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జే మేయర్
డీఓపీ: వెట్రీ పళనిస్వామి
స్టోరీ: భూపతి రాజా
డైలాగ్స్: వెలిగొండ శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
పీఆర్వో : వేణు గోపాల్ – వంశీ-శేఖర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gopichand
  • hattrick
  • latest tollywood news
  • typical actor

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd