AP Assembly : 5 నిమిషాలకే అసెంబ్లీ నుండి వెళ్లిపోయిన జగన్
AP Assembly : గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైఎస్సార్‌సీపీ సభ్యులు (YCP Leaders) నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు
- By Sudheer Published Date - 12:28 PM, Mon - 24 February 25

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైఎస్సార్‌సీపీ సభ్యులు (YCP Leaders) నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. అసెంబ్లీలో గందరగోళం సృష్టించిన అనంతరం, వైఎస్ జగన్ (Jagan) సభలో కేవలం 5 నిమిషాలపాటు మాత్రమే ఉండి, తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీని వదిలి వెళ్లిపోయారు. ఈ చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Makeup Lessons: పురుష పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్.. కారణం తెలిస్తే షాకవుతారు!
అసెంబ్లీ వెలుపల వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సరైన గౌరవం ఉండాలని, ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు అసెంబ్లీలో తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రైతు సమస్యలపై గొంతు విప్పాలంటే సభలో మాట్లాడే అవకాశం ఉండాలన్నారు. కానీ, వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారనే కారణంతోనే ప్రభుత్వం కేసులు పెడుతోందని బొత్స ఆరోపించారు.
ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. వైసీపీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలపై చర్చించకుండా, వైసీపీ నేతలు బయట రాజకీయ వేదికలపై విమర్శలు చేయడాన్ని అధికార పార్టీ తప్పుబడుతోంది. అయితే, ప్రతిపక్షం క్రమంగా బలహీనపడుతోందా? లేక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోందా? అన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది.