Happiest country: ప్రపంచంలో అత్యంత హ్యాపీగా ఉండే దేశం అదే..వరుసగా ఆరోసారి టాప్!
ఫిన్లాండ్ ప్రంపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా వరుసగా ఆరోసారి ఈ ఘనత సొంతం చేసుకుంది.అత్యంత సంతోషంగా ఉండే దేశంగా అగ్రస్థానంలో నిలిచింది.వాస్తవానికి ఈ వరల్డ్ హ్యా పీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొ
- By Anshu Published Date - 09:50 PM, Wed - 22 March 23

Happiest country: ఫిన్లాండ్ ప్రంపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా వరుసగా ఆరోసారి ఈ ఘనత సొంతం చేసుకుంది.అత్యంత సంతోషంగా ఉండే దేశంగా అగ్రస్థానంలో నిలిచింది.వాస్తవానికి ఈ వరల్డ్ హ్యా పీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్స్ ప్రచురిస్తుంది.దీన్ని 150కి పైగా దేశాలలో ప్రజల నుంచి వచ్చిన ప్రపంచ
సర్వే ఆధారంగా రూపొం దిస్తుంది.
మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది.ఐక్య రాజ్య సమితి వార్షిక హ్యాపినెస్ సూచీ ప్రకారం డెన్మార్క్ అత్యంత సంతోషకరమైన దేశంగా రెండో స్థానంలో ఉండగా, ఐస్లాండ్మూడో స్థానంలో ఉంది.
ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ నివేదికలో నేపాల్,చైనా,శ్రీలంక కంటే దిగువున 126వ స్థానంలో ఉంది.ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా హ్యాపినెస్ నివేదికలో వాటి ర్యాంకులు దారుణంగా పడిపోయాయి.రష్యా 72వ స్థానంలో ఉండగా, ఉక్రెయిన్ 92వ స్థానంలో ఉంది.