Chandrayaan-3: చంద్రుడి సమీప కక్ష్యలో చంద్రయాన్-3.. ఇస్రో వీడియో
చంద్రుడికి అత్యంత సమీపంలోని కక్ష్యలో చంద్రయాన్-3 తన కార్యకలాపాలు చేస్తున్నది. రేపు ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది
- By Praveen Aluthuru Published Date - 04:14 PM, Tue - 22 August 23

Chandrayaan-3: చంద్రుడికి అత్యంత సమీపంలోని కక్ష్యలో చంద్రయాన్-3 తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. రేపు ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. అయితే ఈ రోజు ల్యాండర్ చంద్రునిపై మరో కొత్త చిత్రాలని ఇస్రోకి చేరవేసింది, వీటిని ఇస్రో ట్విట్టర్ ద్వారా పంచుకుంది. చంద్రయాన్ 3 ఎలా పనిచేస్తుందో ఇస్రో వివరించింది. చంద్రయాన్ 3 బాగా పనిచేస్తోందని ఇస్రో పేర్కొంది. అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మిషన్ షెడ్యూల్‌లో ఉందని తెలిపారు.
చంద్రుని ఉపరితలంపై తన ల్యాండర్ ల్యాండింగ్ చేయడానికి ఒక రోజు ముందు, చంద్రయాన్ -3 మిషన్ షెడ్యూల్‌లో ఉందని మరియు ప్రతిదీ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తుందని ఇస్రో తెలిపింది. ఈ వ్యవస్థను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని, ప్రస్తుతానికి అయితే సజావుగా కొనసాగుతోందని ఇస్రో తెలిపింది. దీనితో పాటు ల్యాండర్ విడుదల చేసిన చిత్రాల వీడియోను కూడా ఇస్రో పంచుకుంది.
Chandrayaan-3 Mission:
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
— ISRO (@isro) August 22, 2023
చంద్రయాన్ 3 ల్యాండింగ్‌తో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. నిజానికి అంతరిక్ష ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశం భారతదేశం.
Also Read: YCP : సొంత నేతలపై రజనీ డైలాగ్ పేల్చిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్