iPhone 11 : యాపిల్ సంచలన నిర్ణయం..ఆ సిరీస్ స్మార్ట్ ఫోన్లు నిలిపివేత…!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ -14 సిరీస్ స్మార్ట్ ఫోన్లను యాపిల్ విడుదల చేయనుంది.
- By Hashtag U Published Date - 02:46 PM, Tue - 19 April 22
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ -14 సిరీస్ స్మార్ట్ ఫోన్లను యాపిల్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో 2019లో సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యాపిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఐడ్రాప్స్ న్యూస్ రిపోర్టు ప్రకారం…ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన ఐఫోన్ SE-3తో నేరుగా పోటీపడటతో…ఈ ఏడాది నుంచి దశలవారీగా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లు నిలిపివేసేందుకు యాపిల్ రెడీ అయినట్లు తెలుస్తోంది. భారత్ లో ఐఫోన్-11, ఐఫోన్ SE-3స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా సమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్ -11 సిరీస్ స్మార్ట్ ఫోన్లను నిలిపివేయాలని యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఐఫోన్ 12 ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐఫోన్ -12 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు ఐఫోన్-11ధరలతో సరిసమానంగా ఉండే ఛాన్స్ ఉందని ఐడ్రాప్ న్యూస్ తన రిపోర్టులో పేర్కొంది.
Related News
apple : కేంద్రం వార్నింగ్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ యూజర్లకు ‘హై రిస్క్’
apple: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్ ఇన్) తాజాగా భారత్(India) లోని యాపిల్ ఉత్పత్తుల(Apple products) యూజర్లకు(users) భారీ సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది. యాపిల్ డివైస్లలో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబులిటీ’ని గుర్తించామని.. ఇది యూజర్ల డివైస్లు హ్యాకర్ల బారిన పడేందుకు దారితీయొచ్చని హెచ్చరించింది. దీనివల్ల హ్యాకర్లు యాపిల్ డివైస్లలోకి రిమోట్ యాక్సెస్ ద్వారా చొర�