Worlds First Portable Hospital : 72 గదుల ఫ్లయింగ్ హాస్పిటల్.. మేడ్ ఇన్ ఇండియా
Worlds First Portable Hospital : 72 గదులున్న ఈ హాస్పిటల్ ను చాపలా చుట్టేయొచ్చు.. ఎక్కడికంటే అక్కడికి అవలీలగా తీసుకెళ్లొచ్చు..
- By Pasha Published Date - 11:07 AM, Mon - 4 September 23

Worlds First Portable Hospital : 72 గదులున్న ఈ హాస్పిటల్ ను చాపలా చుట్టేయొచ్చు..
ఎక్కడికంటే అక్కడికి అవలీలగా తీసుకెళ్లొచ్చు..
ఇందులో వందలాది మంది పేషెంట్లకు ఏకకాలంలో చికిత్స కూడా చేయొచ్చు..
ఈ స్పెషల్ ఆస్పత్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also read : Asia Cup 2023: శ్రీలంక నుంచి ఇండియాకి బుమ్రా..
ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర వైద్యం అందడం గగనమయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే ఇటువంటి ఆపద సమయాలలో తీవ్ర గాయాలపాలైన వారి ప్రాణాలకు రక్షణ కల్పించగలిగేలా ప్రపంచంలోనే మొట్టమొదటి ‘పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్’ను భారత్ నిర్మించింది.ఈ హాస్పిటల్ మొత్తాన్ని 72 క్యూబ్స్ లో మడత పెట్టేసి మూడు తోపుడు బండ్లుగా మార్చేయొచ్చు. అయితే మూడు తోపుడు బండ్లు కలిసే ఉంటాయి. ఒక్కో తోపుడు బండికి నాలుగు చొప్పున చక్రాలు ఉంటాయి. హాస్పిటల్ ను ప్యాక్ చేసినప్పుడు ఒకవైపు 36 క్యూబ్ లు.. మరోవైపు 36 క్యూబ్ లు ఉంటాయి. ట్రిపుల్ తోపుడు బండిగా మారిన ఈ ఆస్పత్రిని నెట్టుకుంటూ కొండగుట్టలపైకి కూడా తీసుకెళ్లొచ్చు. హెలికాప్టర్ లేదా విమానంలో ఎంతటి మారుమూల ప్రాంతానికైనా ఈ హాస్పిటల్ ను చేరవేయొచ్చు. ఈ ‘పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్’ లో 72 గదులు ఉన్నాయి. 100 మంది రోగులకు 48 గంటల పాటు ట్రీట్మెంట్ చేసే ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ఆపదలో ఉన్నవారి పాలిట ఆరోగ్య సంజీవనిగా మారనున్న ఈ హాస్పిటల్ కు ‘ఆరోగ్య మైత్రి క్యూబ్’ అని పేరు పెట్టారు.
Also read : Voice Of ISRO: ఇస్రో కౌంట్‌డౌన్ వాయిస్ మూగబోయింది.. శాస్త్రవేత్త వలర్మతి మృతి
ఎన్నెన్నో ట్రీట్మెంట్స్..
ఇటీవల గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహించిన G20 దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఏర్పాటుచేసిన మెడ్‌టెక్ ఎక్స్‌పోలో దీన్ని (Worlds First Portable Hospital) తొలిసారి ప్రదర్శించారు. పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్’ లో 40 బుల్లెట్ గాయాలు, 25 రక్తస్రావాలు, 25 పెద్ద కాలిన గాయాలు, సుమారు 10 తల గాయాలు, అవయవాల పగుళ్లు, వెన్నెముక గాయాలు, ఛాతీ గాయాలు, వెన్నెముక పగుళ్లు వంటి వాటికీ ఏకకాలంలో ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఇందుకు అవసరమైన ఆపరేషన్ థియేటర్, మినీ ఐసీయూ, వెంటిలేటర్, రక్త పరీక్ష పరికరాలు, ఎక్స్ రే యంత్రం, వంట స్టేషన్, ఆహారం, నీరు, ఆశ్రయం, పవర్ జనరేటర్ ఈ హాస్పిటల్ లోపల ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ‘ప్రాజెక్ట్ భీష్మ’లో భాగంగా దీన్ని తయారు చేశారు. ‘ఆరోగ్య మైత్రి క్యూబ్’గా పిలువబడే ఈ హాస్పిటల్ ను రక్షణ మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ఒక టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణలో డెవలప్ చేశారు.