IND AUS Indore Pitch Report: ఇండోర్ పిచ్ ఎవరికి అనుకూలమంటే..
వరుసగా రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ట్రోఫీని నిలబెట్టుకుంది.
- By Naresh Kumar Published Date - 05:34 PM, Mon - 27 February 23
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టుకు కౌంట్‌డౌన్ మొదలైంది. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ట్రోఫీని నిలబెట్టుకుంది. రెండో టెస్ట్ తర్వాత కాస్త ఎక్కువ విరామం రావడంతో రిలాక్సయిన ఆటగాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్‌లో బిజీబిజీగా ఉన్నారు. వైఫల్యాల బాటలో ఉన్న కెఎల్ రాహుల్ పైనే అందరి చూపూ ఉంది. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రాహుల్ నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. మరోవైపు ఆసీస్ ఆటగాళ్ళు కూడా నెట్స్‌లో శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో పిచ్‌లు ఎంత కీలకంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు మ్యాచ్‌లూ ఓడిపోవడంతో ఆసీస్ క్రికెటర్లు పిచ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. సహజంగా ఆతిథ్య జట్టు తమకు అనుకూలంగానే పిచ్‌లు రూపొందించుకుంటుంది. ఎప్పటిలానే భారత్‌లోని పిచ్‌లు స్పిన్‌కే అనుకూలిస్తున్నాయి. అయితే మూడున్నర రోజుల్లోనే ముగిసిపోతుండడంతో ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చిందంటూ ఆసీస్ మీడియా కథనాలు కూడా ప్రచురించింది. దీంతో ఇండోర్ పిచ్ విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యూవహరిస్తోంది.
బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఇండోర్ పిచ్ అటు పేస్‌కు, ఇటు స్పిన్‌కు సమానంగా అనుకూలించేలా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల్లో స్పిన్నర్లే పూర్తి ఆధిపత్యం కనబరిచారు. రెండు మ్యాచ్‌లలోనూ స్పిన్నర్లే 52 వికెట్లు పడగొట్టారు. అయితే ఇండోర్‌లో చివరిసారిగా ఆడినప్పుడు భారత పేసర్లు అదరగొట్టారు. బంగ్లాదేశ్‌పై మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగితే.. పేసర్లదే పైచేయిగా నిలిచింది. అప్పుడు కూడా పేసర్లే సత్తా చాటినప్పటకీ ఆ మ్యాచ్ మూడురోజుల్లోనే ముగిసిపోయింది. రెగ్యులర్‌గా ఫార్మాట్ ఏదైనా ఇండోర్ పిచ్ మాత్రం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. తొలి మూడు రోజులూ బౌన్సీ పిచ్గానే ఉంటుందని అంచనా. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో యావరేజ్ స్కోరు 353 పరుగులుగా ఉంది. పిచ్‌ను పరిశీలించిన ఇరు జట్ల కెప్టెన్లు తమ తమ తుదిజట్లలో ముగ్గురు పేసర్లను తీసుకునే అవకాశాలున్నాయి.
Related News
RCB Vs DC: నేటి మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ ఇంటికే.. టాస్ కీలకం కానుందా..?
IPL 2024లో62వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది.