Singapore Job Slowdown: భారతీయ ఉద్యోగాలపై ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. వరుసగా ఉద్యోగ ఖాళీలలో తగ్గింపు?
సింగపూర్ లో రాబోయే నెలలో ఆర్థిక మందగమనం పెరగవచ్చు అని తాజాగా ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అయితే గతవారం సింగపూర్ లో బలహీనమైన ఆర్థిక నివేది
- Author : Anshu
Date : 19-06-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
సింగపూర్ లో రాబోయే నెలలో ఆర్థిక మందగమనం పెరగవచ్చు అని తాజాగా ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అయితే గతవారం సింగపూర్ లో బలహీనమైన ఆర్థిక నివేదిక మాంద్యం భయాలను పెంచింది. ఎగుమతి సంఖ్యలో వరుసగా ఎనిమిదో నెలలో క్షీణించాయి. మొత్తం ఉపాధి నెమ్మదిగా క్షీణిస్తోంది. కాగా ఇటీవల తొలగింపులు పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఉద్యోగ ఖాళీలు వరుసగా నాలుగో త్రైమాసికంలో తగ్గాయి.
అయితే సింగపూర్ వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే చట్టబద్ధమైన బోర్డు అయినా ఎంటర్ప్రైజ్ సింగపూర్ ప్రకారం.. మేలో చమురు ఇతర దేశ ఎగుమతులు 14.7 శాతం క్షీణించాయి. ఏప్రిల్ లో ఎలక్ట్రానిక్స్ నాన్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 9.8 శాతం క్షీణించాయి. హాంకాంగ్ మలేషియా తైవాన్ మార్కెట్లలో బలహీనత ఉన్నప్పటికీ చైనా యూఎస్ లకు దిగమతులు పెరిగాయి. మొత్తం మీద గత నెలలో సింగపూర్ లోనే టాప్ టెన్ షేర్ లలో NODX క్షీణించింది. కాగా బ్లూమ్ బెర్గ్ పోల్ లో అంచనా వేసిన సగటు 7.7 శాతం క్షీణత కంటే 14.7 శాతం తిరోగమనం చాలా అధికంగా ఉంది.
సింగపూర్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 0.4 శాతం క్షీణించింది. వడ్డీ రేట్లలో తీవ్ర పెరుగుదల మధ్య ప్రపంచ వినియోగం మందవించడం, బలహీనమైన సంఖ్యలు సింగపూర్ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక మందగమనం సంకేతాలను సూచించాయి. కాగా సింగపూర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ 2023 కి తన మొదటి త్రైమాసిక లేబర్ మార్కెట్ వినివేదికను విడుదల చేసింది. ఒక సంవత్సరం క్రితం ఇదే కారణంతో పోలిస్తే ఉద్యోగ ఖాళీలు 1,26,000 తగ్గాయి. 99,600 కి తగ్గాయి. తొలగింపులు కూడా వేగవంతమైన వేగంతో జరిగాయి.