Gutka Stain: విమానంలో గుట్కా ఉమ్మేసిన వ్యక్తిపై నెటిజన్లు ఫైర్..చొక్కా విప్పించి తుడిపించాలని డిమాండ్
గుట్కా అలవాటున్న ఓ వ్యక్తి విమానాన్ని కూడా వదిలిపెట్టలేదు.
- Author : Hashtag U
Date : 26-05-2022 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
గుట్కా అలవాటున్న ఓ వ్యక్తి విమానాన్ని కూడా వదిలిపెట్టలేదు. విమానం కిటికీ వద్ద గుట్కాను ఊశాడు. దీంతో అక్కడ మరక పడింది. ఆ విమానంలో ప్రయాణించిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్.. కిటికీ వద్ద గుట్కా మరక ఉండటాన్ని గమనించారు. తన మొబైల్ ఫోన్‌తో దాని ఫొటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్స్ ఘాటుగా స్పందించారు.
గుట్కా ఉమ్మిన వ్యక్తి చొక్కాను విప్పించి తుడిపించాలని పలువురు ఫైర్ అయ్యారు. “ఎవరో తమ గుర్తును వదిలి వెళ్ళారు” అని ఒకరు కామెంట్ చేశారు. ఆ సీటులో కూర్చున్న ప్రయాణికుడిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇంకో నెటిజన్ డిమాండ్ చేశాడు. ఇలా ఉమ్మిన వ్యక్తి మళ్లీ జీవితంలో విమానం ఎక్కకుండా నిషేధం విధించాలని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
अपनी पहचान छोड़ दी किसी ने. pic.twitter.com/xsl68VfhH1
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) May 25, 2022