Harish Shankar : వాళ్లకు హరీష్ శంకర్ సమాధానం ఇదే.. ఇకనైనా అవి ఆపుతారా..?
Harish Shankar టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈమధ్య ఏ సినిమా వస్తున్నా సరే ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపిస్తున్నారు
- Author : Ramesh
Date : 16-11-2023 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
Harish Shankar టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈమధ్య ఏ సినిమా వస్తున్నా సరే ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపిస్తున్నారు. రీసెంట్ గా విక్రాంత్ రెడ్డి నటించి డైరెక్ట్ చేసిన సినిమా స్పార్క్. ఈ సినిమా నిర్మాతగా కూడా అతని భార్య లీల వ్యవహరించారు. స్పార్క్ అంటూ మొదటి సినిమాతోనే భారీగా ఖర్చు పెట్టేశాడు విక్రాంత్. ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హరీష్ శంకర్ గెస్ట్ గా వచ్చారు. ఈమధ్య ఏ సినిమా ఈవెంట్ అయినా ఆయన అటెండ్ అవుతున్నారు. స్పార్క్ సినిమా ఈవెంట్ లో ఆ విషయంపై స్పందించారు హరీష్ శంకర్. తన కెరీర్ ఎర్లీ టైం లో పూరీ జగన్నాథ్, వినాయక్ లు తనని ఎంకరేజ్ చేశారని. అలానే ఇప్పుడు తన జూనియర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నానని అన్నారు హరీష్ శంకర్.
అంతేకాదు తనని సోషల్ మీడియాలో కొందరు అడుగుతున్నారని వారికి కూడా ఇదే తన ఆన్సర్ అని అన్నారు హరీష్ శంకర్. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. పవన్ అటు పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉండటం వల్ల షూటింగ్ లేట్ అవుతుంది. అందుకే పవన్ సినిమాని మధ్యలో ఆపి రవితేజతో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు హరీష్ శంకర్.
Also Read : Bigg Boss 17 : బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్..అసలు ఏంజరుగుతుంది..!
We’re now on WhatsApp : Click to Join