Harish Rao Father Died : హరీశ్ రావు తండ్రి కన్నుమూత
Harish Rao Father Died : బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ రోజు వేకువజామున అనారోగ్యంతో కన్నుమూశారు
- By Sudheer Published Date - 07:11 AM, Tue - 28 October 25
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ రోజు వేకువజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావశీల నేతగా ఎదిగిన హరీశ్ రావు జీవితంలో కుటుంబ పరంగా ఇది ఒక పెద్ద దెబ్బ అని అనిపిస్తోంది.
సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసం క్రిన్స్ విల్లాస్ వద్ద సందర్శనార్థం ఉంచారు. ఈ వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వరుసగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మరణవార్తతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాదం అలుముకుంది.