Telangana : అమిత్ షా వ్యాఖ్యలకు హరీష్ రావు మాస్ కౌంటర్
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని
- By Sudheer Published Date - 11:22 PM, Sun - 27 August 23

ఆదివారం ఖమ్మం (Khammam )లో బిజెపి నిర్వహించిన ‘రైతు గోస- బిజెపి భరోసా’ (‘Raithu Gosa BJP Bharosa’ ) భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. కేసీఆర్ రజాకార్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, కేసీఆర్ 9 ఏళ్లుగా రజాకర్లతో కలిసి పాలన కొనసాగిస్తున్నారని, ఆయనను సాగనంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని , బిఆర్ఎస్ కార్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో లేదని, కేసీఆర్ భద్రాచలం ఇక రావాల్సిన అవసరం లేదని , రాబోయే రోజుల్లో బిజెపి సీఎం భద్రాచలం సీతారాముల కల్యాణానికి వెళ్లబోతున్నారని..ఇలా ఘాటైన వ్యాఖ్యలు కేసీఆర్ ఫై అమిత్ షా చేశారు.
Read Also : Kunamneni Sambasiva Rao : మేము పెట్టిన ప్రతిపాదనలు ఓకే అంటేనే కాంగ్రెస్ తో పొత్తు.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలకు బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Harish Rao) ట్విట్టర్ వేదికగా మాస్ కౌంటర్లు వేశారు. తమకు నూకలు చెల్లడం కాదు…తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు.బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసునని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇలాంటి మీరా కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కార్పోరేట్ సంస్థల కోసం తీసుకు వచ్చిన మూడు రైతు చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేస్తే బీజేపీ తోకముడిచిన విషయాన్ని హరీష్ రావు విమర్శలు చేశారు.కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీదని బీజేపీ సర్కార్ పై హరీష్ రావు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 2జీ, 3జీ, 4జీ కాదు.. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీదని అన్నారు. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండని అమిత్ షా ఫై హరీష్ రావు చురకలేశారు.
మాకు నూకలు చెల్లడం కాదు..
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయిబ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం…
— Harish Rao Thanneeru (@BRSHarish) August 27, 2023