Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్ మంజూరు
12 రోజుల జైలు జీవితం తర్వాత ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది
- By Hashtag U Published Date - 01:30 PM, Wed - 4 May 22

12 రోజుల జైలు జీవితం తర్వాత ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర సీఎం ఇంటి దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం కేసులో అరెస్టయిన ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు ముంబై కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పారాయణం కోసం పిలుపునిచ్చిన తర్వాత ఇద్దరిని వారి ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.ఈ కేసులో వీరిద్దరూ ఒక్కొక్కరికి రూ. 50,000 పూచీకత్తుపై విడుదల చేస్తున్నట్లు వారి తరుపు న్యాయవాది తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నందున దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయవద్దని ఆదేశించింది.