HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄H3n2 Virus Spreading Rapidly In The Country Another Person Died

H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. మరొకరు మృతి !

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా H3N2 వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో మూడో మరణం చోటుచేసుకుంది.

  • By Nakshatra Published Date - 07:38 PM, Tue - 14 March 23
H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. మరొకరు మృతి !

H3N2 Virus: దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా H3N2 వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో మూడో మరణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. వైద్యుల ప్రకారం మహిళ ఇప్పటికే అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతోంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న రోగికి.. వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు.

ఈ వైరస్ కారణంగా హర్యానా, కర్ణాటకలో ఇప్పటికే ఇద్దరు రోగులు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వైద్యుల ప్రకారం H3N2 వైరస్ A ఉప రకం. ఈ వైరల్ ప్రస్తుతం చురుకుగా మారింది. చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌తో బాధపడేవారిలో జలుబు, బాడీ పెయిన్స్ ప్రధాన లక్షణాలు అయితే ఆ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.

ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్‌తో బాధపడుతున్న రోగులకు సకాలంలో వైద్యం అందకపోతే.. బాధితుల ప్రాణాలు కూడా పోతాయి. సరైన సమయంలో వైద్య చికిత్స అందించాలి. చికిత్స అందించే విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. H3N2 వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించి తగిన చికిత్సనందించాలి.

డాక్టర్ అరుణ్ షా ప్రకారం.. ఫ్లూ వ్యాక్సిన్ H3N2 వైరస్‌ను నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీకా శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తుంది. బలహీనమైన పిల్లలు, రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు, వృద్ధులకు వ్యాధితో పోరాడడంలో టీకా సహాయపడుతుందని అరుణ్ షా పేర్కొన్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్ షా అభిప్రాయపడ్డారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

Telegram Channel

Tags  

  • H3N2 Virus
  • new varient
  • virus
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్

XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్

భారతదేశంలో వ్యాపిస్తున్న కరోనా XBB1.16 యొక్క కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది?  12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియంట్ బారినపడకుండా ఎటువంటి..

  • Virus: ఉప్పెనలా మరో వైరస్… పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం!

    Virus: ఉప్పెనలా మరో వైరస్… పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం!

  • Adeno Virus: ఈ కొత్త అడెనో వైరస్ తో జాగ్రత్త. వైరస్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

    Adeno Virus: ఈ కొత్త అడెనో వైరస్ తో జాగ్రత్త. వైరస్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

  • Virus Threat to the World: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు ..!

    Virus Threat to the World: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు ..!

  • Corona Cases: భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్స్!

    Corona Cases: భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్స్!

Latest News

  • srirama navami 2023 : శ్రీరామ నవమి రోజు ఈ 10 మంత్రాలు పఠిస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేయడం ఖాయం..

  • Liquor Bottle Price: ఈ లిక్కర్ బాటిల్ ధర వింటే వామ్మో అనకుండా ఉండలేరు.. ఏకంగా కోట్లల్లోనే ఉందిగా?

  • Sri Rama Navami: శ్రీరామనవమి రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?

  • Actress Laya: నటి లయ అమెరికాలో ఎంత శాలరీ కి పని చేసిందో తెలుసా..?

  • TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN

Trending

    • Pan – Aadhaar Link: పాన్ కార్డు, ఆధార్ లింకు చేసేందుకు గడువు మరో 3 నెలలు పొడిగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?

    • Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..

    • Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!

    • Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…

    • PGCIL Recruitment : బీటెక్ చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారేంటీ…ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: