GV Reddy : ‘2029 లోనూ మా సార్ CM కావాలి’ GV రెడ్డి ట్వీట్
GV Reddy : ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన ప్రశంసిస్తూ, తక్కువ రెవెన్యూ లోటుతో భారీ బడ్జెట్‌ను రూపొందించడాన్ని అభినందించారు
- By Sudheer Published Date - 11:00 AM, Sat - 1 March 25

టీడీపీ(TDP)కి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి (GV Reddy) ఫస్ట్ టైం చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న శుక్రవారం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన ప్రశంసిస్తూ, తక్కువ రెవెన్యూ లోటుతో భారీ బడ్జెట్‌ను రూపొందించడాన్ని అభినందించారు. కేవలం రూ.33,000 కోట్ల రెవెన్యూ లోటుతోనే రూ.3.2 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్థంగా ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు.
Top 5 Predictions 2025: ఈ ఏడాది జరగబోయే ఐదు విపత్తులివే.. టైం ట్రావెలర్ జోస్యం
తాను పార్టీకి దూరమైనప్పటికీ, చంద్రబాబు నాయుడుపై తనకెప్పుడూ గౌరవమేనని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు తనకు దక్కిన గౌరవాన్ని గుర్తుచేసుకుంటూ, చంద్రబాబు నాయకత్వాన్ని ఎప్పటికీ మెచ్చుకుంటానని పేర్కొన్నారు. ఇది ఆయన పార్టీకి తిరిగి చేరనున్నారనే ఊహాగానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆయన చేసిన “2029లోనూ మా సార్ సీఎం కావాలి” వ్యాఖ్య రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.
ఈ ట్వీట్ అనంతరం టీడీపీ వర్గాల్లో విశేష చర్చ నడుస్తోంది. పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతలు, తిరిగి టీడీపీ వైపు ఆకర్షితమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడి ప్రభావం కొనసాగుతుందనడానికి జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా మారాయి.
నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు.
నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల…
— G V Reddy (@gvreddy0406) March 1, 2025