TTD:తిరుమలలో గ్రీన్ మ్యాట్…టీటీడీకి అభినందనలు..!!
ఎండాకాలం సెలవులు ముగుస్తున్నాయి. మరికొద్దిరోజుల్లోనే పాఠశాలలు తెరచుకోనున్నాయి.
- By hashtagu Published Date - 02:31 PM, Sun - 5 June 22

ఎండాకాలం సెలవులు ముగుస్తున్నాయి. మరికొద్దిరోజుల్లోనే పాఠశాలలు తెరచుకోనున్నాయి. ఈ ఏడాది తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలుదేరుతున్నారు. వేసవి ముగుస్తుండటంతో కొండపై భక్తుల కోలాహలం నెలకొంది. చాలామంది కాలినడకన స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు గ్రీన్ కార్పెట్ ను ఏర్పాటు చేశారు. కాగా శనివారం ఒక్కరోజే 90వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామివారి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.
కాలినడకన దర్శించుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. కానీ వేసవిలో కాలినడకన అంటే చాలా కష్టం. ఎంత కష్టమైనా సరే స్వామివారిని దర్శించుకోవాలని కాలినడకనే చాలామంది బయలుదేరారు. ఎండవేడికి భక్తుల కాళ్లు కందిపోకుండా…గ్రీన్ క్పారెట్ ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుభ్బారెడ్డి గమనించారు. ఆయన తిరుమల నుంచి తిరుపతికి వచ్చే నడక దారిలో మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి వరకు ఎండవేడిలో భక్తులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. వారితో మాట్లాడిన సుబ్బారెడ్డి నడక మార్గంలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి మలపు వరకు గ్రీన్ మ్యాట్ వేయించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే స్పందించిన సిబ్బంది…గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు సౌకర్యంగా వెళ్లేలా చూశారు. టీటీడీ ఏర్పాట్లను చూసిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.