Covid 19: అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ మార్గదర్శకాలు సడలింపు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అదుపులోకి వచ్చింది. ఈ మేరకు ప్రపంచ దేశాలు కోవిద్ ఆంక్షలను సడలిస్తున్నారు. తాజాగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ సందర్శకుల
- By Praveen Aluthuru Published Date - 03:22 PM, Wed - 19 July 23

Covid 19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా అదుపులోకి వచ్చింది. ఈ మేరకు ప్రపంచ దేశాలు కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్నారు. తాజాగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ సందర్శకుల కోసం COVID-19 మార్గదర్శకాలను మరింత సడలించింది. నిజానికి ఇతర దేశాల నుంచి వచ్చే వారు RT-PCR తప్పనిసరి. అయితే తాజాగా సడలింపుల్లో RT-PCR అవసరం లేదు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, కేసులు తగ్గిపోవడం ద్వారా ఆంక్షలు అవసరం లేదని భావించిన భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త మార్గదర్శకాలు జూలై 20 అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయి. అయితే కోవిడ్ సందర్భంలో విమానయాన సంస్థలు మరియు అంతర్జాతీయ ప్రయాణికులు అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యల కోసం అంతకు ముందు సలహాలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read More: Meenakshy chaudhary : యెల్లో కలర్ శారీలో మీనాక్షి చౌదరి తళుకులు