Governor Tamilisai:’యాదాద్రి’లో గవర్నర్ ‘తమిళసై’ పూజలు…!
తెలంగాణ తిరుపతిగా కీర్తించబడుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ సందర్శించారు.
- Author : Hashtag U
Date : 07-03-2022 - 12:37 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ తిరుపతిగా కీర్తించబడుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ సందర్శించారు. బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు సంయుక్తంగా ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అలంకార సేవలో గవర్నర్ పాల్గొన్నారు. అంతకు ముందు పూర్తయిన ప్రధానాలయ నిర్మాణాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు.