Goa Police: మిస్టరీగా మారిన కేసు.. హైదరాబాద్‌కు గోవా పోలీసులు
హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో లారీ డ్రైవర్ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది.
- By Hashtag U Published Date - 11:10 AM, Sat - 9 April 22

హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో లారీ డ్రైవర్ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. గత నెల 19న 10మంది ప్రయాణికులను గోవాకు తీసుకువెళ్లిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్.. మరుసటి రోజు అదృశ్యమై మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో తిరిగివచ్చాడు.అయితే గోవాలో వెతికినా ఫలితం లేకపోవడంతో అంజున పీఎస్ లో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గోవా నుంచి పోలీసులు హైదరాబాద్‌కి వచ్చారు. మిస్సింగ్ కేసు నమోదైన అంజున పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతో బోరబండలోని శ్రీనివాస్ ఇంటికి వచ్చి లారీ డ్రైవర్‌ని విచారించారకు. అతను గోవాకు ప్రయాణించిన తేదీ, సమయం, అతను నగరానికి తిరిగి వచ్చిన వివరాలను వారు అతనిని అడిగినట్లు తెలిసింది.
ఎస్ ఆర్ నగర్ పోలీసులు స్థానికంగా గోవా పోలీసు బృందానికి మాత్రమే సహాయం చేస్తున్నారని విచారణలో భాగం కాదని గోవా పాలీసులు తెలిపారు. కాగా ఈ కేసును సమగ్రంగా విచారించాలని గోవాలో ఏం జరిగిందో తేల్చాలని శ్రీనివాస్ కుటుంబీకులు పోలీసులను కోరారు. శ్రీనివాస్ గోవాలో అనుమానాస్పదంగా కనిపించకుండా పోయి… ఈ నెల ప్రారంభంలో అతని శరీరంపై అనుమానాస్పద కుట్టులతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అయితే ఎవరైన అతన్ని కిడ్నాప్ చేసి అవయవాలు తీసుకున్నట్లు అనుమానాలు రేకేత్తుతున్నాయి. అయితే పరీక్షల అనంతరం అతని అవయవాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు.