Rubber Band in KFC: కేఎఫ్సీ చికెన్‌లో రబ్బర్ బ్యాండ్ .. షాక్ తిన్న కస్టమర్
హైదరాబాద్: రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేసిన ఫ్రైడ్ చికెన్ డిష్‌లో రబ్బర్ బ్యాండ్ కనిపించడంతో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్‌సి)పై జిహెచ్‌ఎంసికి సాయితేజ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తాను ఆదివారం కొనుగోలు చేసిన చికెన్‌లో రబ్బర్ బ్యాండ్ ఉందని సాయి తేజ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
- By Hashtag U Published Date - 11:57 AM, Tue - 31 May 22

హైదరాబాద్: రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేసిన ఫ్రైడ్ చికెన్ డిష్‌లో రబ్బర్ బ్యాండ్ కనిపించడంతో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్‌సి)పై జిహెచ్‌ఎంసికి సాయితేజ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తాను ఆదివారం కొనుగోలు చేసిన చికెన్‌లో రబ్బర్ బ్యాండ్ ఉందని సాయి తేజ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై తొలుత కేఎఫ్‌సీకి ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆయన తెలిపారు.
కేఎఫ్సీ చికెన్ ముక్కను తింటున్నప్పుడు తనకు ప్లాస్టిక్ పదార్థం తగిలిందని దానిని పరిశీలించగా రబ్బరు లాగా కనిపించిందని తెలిపారు.తాను KFCకి ఫోన్ చేసి సమస్య గురించి చెప్పానని.. వారు తనకు కస్టమర్ సర్వీస్ నంబర్ ఇవ్వగా .. సర్వీస్ ఫోన్ లైన్‌ని సంప్రదించినప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సాయితేజ తెలిపారు.దీంతో తాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి ఫిర్యాదు చేశానని తెలిపారు. సాయి తేజ ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను పంపించి విచారణ చేపట్టింది.
@swiggy_in @SwiggyCares @KFC_India yesterday I have got a rubber band in #chicken I request @zckukatpally @AMOH_KUKATPALLY @GHMCOnline @fssaiindia to take necessary checks & act accordingly, please#food @CoreenaSuares2 @TheSiasatDaily @DeccanChronicle pic.twitter.com/CpyzI6ep2p
— SAI TEJA (@ActivistTeja) May 30, 2022
క్లారిటీ ఇచ్చిన కేఎఫ్‌సీ.
అయితే, కస్టమర్ ఇచ్చింన కంప్లయింట్‌పై జీహెచ్ ఎంసీ అధికారులు విచారణ నిర్వహించారని, అది ఫేక్ కంప్లయింట్ అంటూ కేఎఫ్‌సీ చెబుతోంది. కస్టమర్లకు అత్యుత్తమ క్వాలిటీ ఫుడ్‌ని అందించడం తమ లక్ష్యమంటున్న కేఎఫ్‌సీ, తాము వాడే చికెన్ ముక్కలను క్షుణ్ణంగా 34 క్వాలిటీ చెక్స్ చేసి కానీ కస్టమర్లకు అందించమని చెబుతున్నారు.

Clarification Email From KFC