Fuel Prices Cut: వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్…భారీగా తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు..!!
గతకొన్నాళ్లుగా పెట్రోలు,డీజిల్ ధరలు పైపైకి దూసుకెళ్లడం తెలిసిందే. పెట్రోలు లీటర్ నూ. 120వరకు ఉండగా...డీజిల్ లీటర్ రూ. 105వరకు పలుకుతోంది.
- By Hashtag U Published Date - 08:19 PM, Sat - 21 May 22

గతకొన్నాళ్లుగా పెట్రోలు,డీజిల్ ధరలు పైపైకి దూసుకెళ్లడం తెలిసిందే. పెట్రోలు లీటర్ నూ. 120వరకు ఉండగా…డీజిల్ లీటర్ రూ. 105వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోలు పై రూ. 8, డీజిల్ రూ. 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో లీటర్ పెట్రోలు ధర రూ. 9.50 మేర తగ్గుతుంది. లీటర్ డీజిల్ ధర రూ. 7 మేర తగ్గనున్నట్లు వివరించారు.
మార్చి 22నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో ధరలను 14 సార్లు పెంచిన సంగతి తెలిసిందే. తద్వారా లీటర్ పై గరిష్టంగా రూ. 10 వరకు పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వాహనదారులకు ఊరటనిచ్చింది.