Free Sand : ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక పంపిణీ
ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో వినియోగదారుడికి రోజుకు గరిష్ఠంగా 20 టన్నుల ఇసుక ఇవ్వనుంది.
- By Kavya Krishna Published Date - 10:26 AM, Sun - 7 July 24

ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో వినియోగదారుడికి రోజుకు గరిష్ఠంగా 20 టన్నుల ఇసుక ఇవ్వనుంది. ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ముఖ్యమైన విధాన చర్యలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వారంలో ఇసుక ఉచిత సరఫరాను అమలు చేస్తామని గతవారం పేర్కొంది.. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోగా జూలై 8 నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఉచిత ఇసుక సరఫరా అనేది ఎన్డీయే ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన హామీలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక, భూములు, మద్యం మాఫియా గత హయాంలో సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొత్త ఇసుక పాలసీని ఆవిష్కరించే సన్నాహాల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమవుతున్న ఇసుక మొత్తాన్ని అధికారులు అధ్యయనం చేయడంతోపాటు గత హయాంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి కాంట్రాక్టులు పొందిన వారితో చర్చలు జరుపుతున్నారు. సాధారణ వనరులతో పాటు, ప్రస్తుతం ఇసుక అందుబాటులో ఉన్న రిజర్వాయర్లు , బ్యారేజీలలో కూడా అంచనాలు తీసుకోబడ్డాయి, ఇవి రాబోయే రెండు-మూడు నెలలకు సరఫరా చేయబడతాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉచిత ఇసుక విధానం అమలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జులై 8 నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలుకు తీసుకుంటున్న చర్యలపై వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించిన ముఖ్యకార్యదర్శి.. ఈ మేరకు వారికి ఆదేశాలు జారీ చేసి వారివారిలో ఉచిత ఇసుక విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు తెలిపారు.
అయితే.. వినియోగదారుడు ఆన్‌లైన్‌లో చార్జీలు చెల్లించవచ్చని, ముందుగా వచ్చిన వారికి ముందుగా సరఫరా చేసే పద్ధతిలో ఇసుకను సరఫరా చేయాలని కలెక్టర్లకు సూచించారు. అందుబాటులో ఉన్న ఇసుక నిల్వల ప్రకారం సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్ లతో పాటు కొత్త ఇసుక రీచ్ లను గుర్తించి అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇసుక రవాణాకు అవసరమైన అంతర్గత, వినియోగదారుల అనుమతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
Read Also : Bonalu : బోనాలకు ముస్తాబైన గోల్కొండ కోట.. ఇవాళ జగదాంబిక అమ్మవారికి బోనాలు