Convicted: మరో కేసులో హర్యానా మాజీ సీఎం చౌతాలా దోషి
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మరో కేసులో దోషిగా తేలారు.
- By CS Rao Published Date - 06:44 PM, Sat - 21 May 22

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మరో కేసులో దోషిగా తేలారు. ఇప్పటికే టీచర్ల కుంభకోణంలో దోషిగా నిర్థారింపబడి పదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ఆ శిక్ష పూర్తి చేసుకుని గతేడాది జులైలో ఆయన విడుదలయ్యారు. పదేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఆయన మరో కేసులో దోషిగా నిలిచారు. ఈ సారి ఏ తరహా శిక్ష పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఆరోపణలపై చౌతాలాపై గతంలోనే కేసు నమోదు అయ్యింది. ఆ కేసు విచారణను చేపట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శనివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు ఏ తరహా శిక్ష విధించాలన్న విషయంపై కోర్టు ఈ నెల 26న చేపట్టనున్న విచారణలో నిర్ణయం తీసుకోనుంది.