HYD: అసత్య ప్రచారాన్ని ఖండించిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దీన్
తాను పరారీలో ఉన్నానంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని బాబా ఫసియుద్దీన్ తీవ్రంగా ఖండించారు.
- By Balu J Published Date - 12:46 PM, Wed - 20 December 23

HYD: హైదరాబాద్ : పోలీసులు తన కోసం గాలిస్తున్నారు అంటూ తాను పరారీలో ఉన్నానంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో కోస్గి BRS ఇన్ ఛార్జ్ ఉన్నందున ఇరు పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు అయిందని, అందులో తన పేరు కూడా ఉందని ఆయన వివరణ ఇచ్చారు.
ఆ కేసు నమోదు కూడా దాదాపు 20 రోజులు పైగానే అవుతుందని కానీ కొంతమంది కొత్తగా దాన్ని తెరపైకి తీసుకువచ్చి తప్పుడు ప్రచారం చేయించడం బాధాకరమన్నారు. పోలీసులు ఎవరు తన ఇంటికి రాలేదని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నేతలపై కేసులు నమోదవడం సహజమని బాబా అన్నారు. ఉద్యమకారులు కేసులకు భయపడి పారిపోరని గుర్తు చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడున్ని అని ఎలాంటి కేసులైన న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు.